This is Language

Top-Utility-Menu

Want to add your listing to our website ? ? It is totally FREE !

It may be local retail shop, wholesale shop, medical shop, hospital, xerox shop, school, college or any business.
Click here to add

24 year-old woman was murdered near collectorate office in Karimnagar

She was identified as Rasagna, who works in the local Mee Seva centre in front of the Karimnagar collectorate.

కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతి గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో జరిగింది. కలెక్టర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో రసజ్ఞ అనే యువతి పనిచేస్తోంది. రోజులానే శుక్రవారం విధులకు హాజరైంది. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంశీధర్ అనే ఓ యువకుడు వచ్చి తనతో మాట్లాడాలని కోరడంతో రసజ్ఞ బయటకు వెళ్లింది. వారిద్దరి మద్య వాగ్వాదం జరిగనట్లు తెలుస్తోంది. దీంతో వంశీధర్ తనవెంట తెచ్చుకున్న కత్తితో రసజ్ఞ గొంతు కోశాడు.

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను మీసేవా సిబ్బంది వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గమధ్యలోనే రసజ్ఞ మృతిచెందింది. గొంతుకోసి పారిపోతున్న వంశీధర్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాటారం మండలంకు చెందిన వంశీధర్ రసజ్ఞల మధ్య గత మూడు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది.

24 year-old woman was murdered near collectorate office in Karimnagar
24 year-old woman was murdered near collectorate office in Karimnagar
Source/Courtesy: 
Oneindia and thehansindia websites